పారిశ్రామిక అవసరాల కోసం రిజర్వు చేసిన స్థలంలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని టీఎస్ఐఐసీ అధికారులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామ శివారులోని టీఎస్ఐఐసీకి చెందిన స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో శంకుస్థాపన చేయించారు. ఇవాళ పునాదులు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న టీఎస్ఐఐసీ అధికారులు పనులను అడ్డుకున్నారు.
శంకుస్థాపన రోజునే పనులు చేపట్టవద్దంటూ గ్రామపంచాయతీ కార్యవర్గానికి సూచించామన్నారు ఐలా ఛైర్మన్ చందు పొట్టి. అయినా రాత్రి సమయంలో గుంతలు తవ్వారన్నారు.
గ్రామంలో ఖాళీ స్థలం లేకపోవడం వల్లనే ఆలయం నిర్మాణానికి కొంత భూమిని వినియోగించు కోవాలనుకున్నామని పాశమైలారం ఉపసర్పంచి కృష్ణ యాదవ్ తెలిపారు. అనుమతి కోసం అధికారులకు దరఖాస్తు చేశామన్నారు.