ఏది మంచో.. ఏది చెడో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సంగారెడ్డి జిల్లా అల్లదుర్గం తెరాస సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో గమనించాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుంటే రైతుబంధు, రైతు బీమా పథకాలు సాధ్యమయ్యేవి కావని పేర్కొన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండానే బాధిత రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు నీరిచ్చే బాధ్యత తనదని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇవి చూడండి:ఇంద్రకరణ్కు అగ్నిపరీక్ష... సయోధ్య కుదిరేనా?