ETV Bharat / state

జహీరాబాద్​లో ఆధిక్యంలో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​

జహీరాబాద్​లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్​ ఉదయం నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

తెరాస అభ్యర్ధి
author img

By

Published : May 23, 2019, 12:28 PM IST

Updated : May 23, 2019, 2:19 PM IST

జహీరాబాద్​ పార్లమెంటు నియోజక వర్గంలో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితంలో 11,830 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం మొదటి రౌండు నుంచి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్​ ఎంపీ సురేష్​ షట్కార్​పై లక్షా నలభై ఓట్ల ఆధిక్యంతో బీబీ పాటిల్​ విజయ భేరి మోగించారు. ఈసారి ఎంత ఆధిక్యం వస్తుందో చూడాలి. పాటిల్​ ఆధిక్యంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే బీబీ పాటిల్​ గెలుపునకు దోహదపడుతున్నాయి. భాజపా అభ్యర్థి లక్ష్మారెడ్డి మోదీ మానియా ఇక్కడ పనిచేయడం లేదు. ఇక కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​ మోహన్​రావు ఎదురీదుతున్నారు.

ఇదీ చూడండి : హైదరాబాద్​లో ఎంఐఎం, భాజపా హోరాహోరీ

TG_KRN_31_23_PEDDAPALLI_COUNTING_AV_C7
Last Updated : May 23, 2019, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.