సంగారెడ్డిలో తెరాస పార్టీలో నేతలు వర్గాలుగా ఉంటున్నారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ నేతలు ఖండించారు. తామంతా ఐకమత్యంతోనే ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీకి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే స్థానికంగా తమకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అని పేర్కొన్నారు.
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసి మెలిసి ఉన్నామని, అందరం కలిసే పార్టీని ముందుకు నడుపుతామని వివరించారు. గత 15 రోజులుగా వస్తున్న వార్తలు, కథనాలు అనవసరంగా సోషల్ మీడియాలో వినిపించడం బాధాకరం అన్నారు.