సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పట్టణంలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, మాస్కులు అందించారు. మరోవైపు డివిజన్ పరిధిలోని ఆయా మండలాలు, గ్రామాల్లోనూ వేడుకలు సాదాసీదాగా జరిగాయి.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం