సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జహీరాబాద్ ఇన్ఛార్జీ ఆర్డీఓ రమేష్ బాబు నేతృత్వంలో నామపత్రాల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, తుది జాబితా వెల్లడి తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్‌పై ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలపై వివరించారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి కరదీపికలను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి;వైద్యుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం