సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గాజుల్పాడ్లో విషాదం చోటుచేసుకుంది. ఈత నేర్చుకోవడానికని బావిలోకి దిగిన ఎనిమిదో తరగతి విద్యార్థి రాజ్‌కుమార్... నీళ్లల్లో మునిగిపోయి మరణించాడు. గ్రామానికి చెందిన మంగళి రాజ్‌కుమార్... తన మిత్రుడితో కలిసి శివారులోని బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్ళాడు. మిత్రుడిని ఒడ్డు పైన కూర్చోబెట్టి... ఒక్కడే బావిలోకి దూకాడు. ఈత రాక నీటిలో మునిగిపోతున్న అతన్ని చూసిన బాలుడు... గ్రామంలోకి పరిగెత్తి, బాధితుడి మేనమామ శివాజీకి సమాచారం అందించాడు. ఆయన వచ్చే సమయానికే రాజు బావిలో పూర్తిగా మునిగిపోయాడు. పోలీసులు... స్థానికుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రఫిక్ తెలిపారు.
ఇదీ చూడండి : తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది: బండి సంజయ్