సంగారెడ్డి జిల్లా మ్యూనిపల్లి మండలంలోని బుధేర చౌరస్తాలోని దుకాణాల్లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కిరాణ, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి లక్ష నగదుతో పాటు విలువైన సామాగ్రిని అపహరించినట్లు యజమానులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో క్లూస్ టీం సిబ్బందిని రప్పించి వేలిముద్రల సేకరణ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి : "సమ్మె గురించి తెలియక వచ్చాం"