సంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షం అన్నదాతలను మరోసారి ఇబ్బందులకు గురిచేసింది. హత్నూర, దౌల్తాబాద్, బోర్పట్లలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
తెచ్చిన ధాన్యం తడవకుండా ఉంచటానికి టర్పైన్ కవర్లు సైతం అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నదాతలు వేడుకుంటున్నారు.
సకాలంలో సంచులు ఇవ్వకపోవడం వల్లనే.. బస్తాల్లో ధాన్యం నింపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రారంభించిన తర్వాతే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారని వాపోయారు. చేతికి వచ్చిన ధాన్యం తడవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు.
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య