పేదల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1500 నగదును ఇప్పటివరకు తీసుకోని వారు తమ సమీపంలోని పోస్టాఫీసు నుంచి తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు నగదు జమకాని వారికి పోస్టాఫీసు ద్వారా నేరుగా కార్డుదారులకు నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
బ్యాంకుల నుంచి నగదు తీసుకోని వారు తమ ఆధార్ కార్డుతో దగ్గరలోని పోస్టాఫీసుకి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా 1500 రూపాయలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.