ETV Bharat / state

కల్లు కోసం తల్లిని చంపిన కసాయి కూతురు - daughter killed her mother in sangareddy

అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లినే హతమార్చింది ఓ కసాయి కూతురు. కల్లుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కన్న తల్లినే చంపేసింది. మానవత్వానికి మచ్చగా నిలిచిన ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలగుచూసింది.

The daughter  killed her mother for not given money for Alcohol
కల్లు కోసం తల్లిని చంపిన కసాయి కూతురు
author img

By

Published : Dec 28, 2020, 7:26 AM IST

కల్లుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని సొంత కూతురే హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం తెల్లవారు జామున సోనమ్మను గొంతు నులిమి హతమార్చిన కూతురు ఇందిరమ్మ, మనుమరాలు లక్ష్మి ప్రస్తుతం పరారిలో ఉన్నారు.

హద్నూర్ గ్రామానికి చెందిన డెబ్బై ఏళ్ల సోనమ్మతో కలిసి కూతురు ఇందిరమ్మ(48) మనుమరాలు లక్ష్మి(28) నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి కల్లు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కూతురు, మనుమరాలు ఆమెతో గొడవ పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ దౌర్జన్యానికి దిగడంతో ఇరుగుపొరుగు సర్ది చెప్పారు. ఉదయం 10 అయినా సోనమ్మ బయటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: అడ్డగోలుగా దోచుకుంటున్నారు.. అప్రమత్తంగా ఉండండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.