ETV Bharat / state

కార్యాలయాలన్ని ఒకే చోటున్నా... కష్టాలు తప్పడంలేదు - elections effect

సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్​ కార్యాలయం అన్ని జిల్లా కలెక్టర్​ కార్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఒకేచోట 40కు పైగా జిల్లా కార్యాలయాలు ఉండడం దీని ప్రత్యేకత. అదే ఇప్పుడు సామాన్యులకు సమస్యగా మారింది.

సామాన్యుల పడిగాపులు
author img

By

Published : Mar 22, 2019, 10:16 PM IST

సామాన్యుల పడిగాపులు
సంగారెడ్డి జిల్లా కలెక్టరెట్​లో40కిపైగా కార్యాలయాలు ఉన్నాయి. ఎన్నికల దృష్ట్యా.. జహీరాబాద్ లోక్​సభ అభ్యర్థుల నామపత్రాలను ఇక్కడ స్వీకరిస్తున్నారు. ఈ కారణంగా లోపలికి ఎవరిని అనుమతించొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.గేటు బయటే పడిగాపులు...
కలెక్టర్​ ఆదేశంతో పోలీసులు ఎవరినైనా గేటు బయటనే కట్టడిచేస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులను సైతం బయటనే ఉంచడం గమనార్హం. కొందరు ఉద్యోగులు జిల్లా అధికారుల సాయంతో లోపలికి వెళ్తున్నారు. సామాన్యులను మాత్రం 3గంటల వరకు అనుమతించేదిలేదని పోలీసులు స్పష్టం చేశారు.
లోపలికి అనుమతించండి...
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమస్య పరిష్కరించుకోవలనుకున్నా సామాన్యులు గేటు బయటనే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమని లోపలికి అనుమతించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:నామినేషన్లు తీసుకోలేదని పసుపు రైతుల ఆందోళన

Intro:tg_srd_60_22_samanyula_padigapulu_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరు కార్యాలయ భవనం.. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ఆదర్శం. ఎందుకంటే ఒక్క చోటే కలెక్టర్ తో పాటు.. 40కు పైగా జిల్లా కార్యాలయాలు ఇక్కడ ఉండడం. ఇప్పుడు అన్ని ఓకే చోట ఉండడమే సామాన్యులకు పెను సమస్యగా మారింది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల దృశ్య.. జిల్లా కలెక్టరేట్ లో జహీరాబాద్ లోక్ సభ అభ్యర్థుల నామపత్రాలను స్వీకరిస్తున్నారు. కార్యాలయం లోపలికి ఎవరిని లోనికి అనుమతించొద్దని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో.. పోలీసులు ఎవ్వరైనా గేటు బయటనే కట్టడిచేస్తున్నారు. దీనిలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులను సైతం బయటనే ఉంచడం గమనార్హం. కొందరు ఉద్యోగులు జిల్లా అధికారుల సాయంతో లోపలికి వెళ్తుండగా.. సామాన్యులను మాత్రం 3గంటల వరకు అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి రావడం.. సమస్య పరిష్కారించుకోవలనుకున్నా సామాన్యులు గేటు బయటనే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమని లోపలికి అనుమతించాలని వారు కోరుతున్నారు.

Body:విజువల్

Conclusion:సంగారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.