సమయం ఆసన్నమైంది..
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే దేశాన్ని ఏ రకంగా ఏలుతారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాహుల్ సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో భట్టి, గీతారెడ్డి చర్చించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన