కేంద్రం ఆంక్షల వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంలేదని.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశీయ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ముందస్తుగా చెల్లించినా, చివరకు గ్లోబల్ టెండర్లు పిలిచినా కేంద్రం నిబంధనలతో కావాల్సినంత వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోతున్నామని.. అసంతృప్తి వ్యక్తం చేశారు.
కల్వరీ టెంపుల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని హరీశ్ ప్రారంభించారు. విదేశీ కరోనా టీకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.