Telangana Institute of Hotel Management Sangareddy : వంట చేయటం అనేది అందరికీ రాదు.. అదో కళ. దానిని ఉపాధిగా ఎంచుకుని, పాకశాస్త్రంలో రాణించే వారికి ఆతిథ్య రంగంలోకి అపార అవకాశాలుంటాయి. ఇందుకు కావాల్సిన నైపుణ్యాలు అందించి.. ఆధునిక నలభీములను తీర్చిదిద్దే హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలు అత్యంత అరుదుగా ఉంటాయి. అందులో ఒకటే సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల (Government Hotel Management College in Sangareddy). ఇంటర్మీడియట్ పూర్తిచేసిన యువతకు వృత్తి విద్యాకోర్సుల ద్వారా ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ఏర్పాటైంది.
Telangana Institute of Hotel Management Sangareddy Problems : విమానయానం, నక్షత్ర హోటళ్లు, నౌకాయానం, రైల్వేలు, బ్యాంకింగ్, రెస్టారెంట్లలో ఉద్యోగ, ఉపాధి కోర్సులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హైదరాబాద్ గచ్చిబౌలితో పాటు సంగారెడ్డి జిల్లా కవేలిలో ప్రభుత్వ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలు నెలకొల్పారు. కవేలిలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల నాటి కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు కాగా.. రాష్ట్రావిర్భావం తర్వాత సీఎం సర్కార్ ఐదెకరాల భూమి కేటాయించింది. కేంద్రం నుంచి మంజూరైన రూ.12 కోట్ల నిధులతో కళాశాల భవనం, వసతిగృహం, ప్రయోగ విభాగాలను 2017లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
College Farewell Day in Secunderabad : 'పాకశాస్త్ర నిపుణుల కోసం ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోంది'
Telangana Institute of Hotel Management Sangareddy Disused : హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఏడాదిన్నర డిప్లొమా కోర్సు సీసీఎఫ్ (CCF), పీపీ, క్రాఫ్ట్ మెన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్‌లో చేరేందుకు చాలామంది ఇక్కడ ప్రవేశం పొందారు. 2017 వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, దిల్లీ, బంగాల్, బిహార్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు శిక్షణ పొందే అవకాశం లభించింది. కోర్సు (Hotel Management Courses) పూర్తి చేసుకున్న వారు అమెరికా, లండన్, దుబాయ్‌తో పాటు దేశీయంగా స్టార్ హోటళ్లలో భారీ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారు. పాకశాస్త్రంలో సిద్ధహస్తులను తీర్చిదిద్దిన ఈ కళాశాలలో ఒకప్పుడు సీటు దొరకటమే గగనంగా ఉండేది. కాలక్రమేణా పరిస్థితి తారుమారైంది. గతమెంతో ఘనకీర్తి ఉన్నా.. కరోనా తర్వాతి రోజుల్లో పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రభుత్వాల నుంచి పైసా రాకలేదు! : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కళాశాలను ఏర్పాటు చేసినా.. స్వయం నిర్వహణ విధానం అమలు సమస్యగా మారింది. ఉపకార వేతనాలు, బోధన రుసుంలు చెల్లించే అవకాశం లేకపోవడం వల్ల నిర్వహణ భారంగా మారుతోంది. ప్రభుత్వాల నుంచి పైసా రాక అధ్యాపకులు సహా సిబ్బందికి విద్యార్థులు చెల్లించిన ఫీజులతోనే వేతనాల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలోనే కరోనా పరిస్థితులు ఆతిథ్య రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయగా.. అప్పటి నుంచి ఈ కళాశాలకు విద్యార్థుల రాక తగ్గుతూ వస్తోంది. గతంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రవేశాలు పొంది విద్యార్థులతో కళకళలాడిన కళాశాల.. నేడు వెలవెలబోతోంది. ప్రస్తుతం ఒక అడ్మిన్ అధికారి, అటెండర్, కాపలాదారు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటైన హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల నిర్వహణపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. ఎందరో యువత భవిష్యత్‌కు బాటలు వేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
SSC Jobs 2023 : ఇంటర్ అర్హతతో.. ఎస్ఎస్సీలో 1207 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు!
Flytech Aviation Academy : ఇంటర్‌తోనే ఏవియేషన్ రంగంలో ఉద్యోగం