సంగారెడ్డి సమీపంలో ఐఐటీ హైదరాబాద్‌లో ఎలాన్ ఎన్విజన్ టెక్‌ఫెస్ట్ జరిగింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు.
నేడు వివిధ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొని వారు తయారు చేసిన ఆవిష్కరణలు ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థుల్లో దాగిఉన్న సాంకేతిక, సాంస్కృతిక నైపుణ్యాలు వెలికితీసేందుకు ఈ ఫెస్ట్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. నూతన ఆవిష్కరణలు, సాంస్కృతిక సందడితో మొదటి రోజు ఈ కార్యక్రమం ఎంతో సరదాగా సాగింది.