ETV Bharat / state

'టీచర్ల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?'

తెరాస ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోందని పీఆర్​టీయూటీఎస్ మండిపడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.

Teachers in Sangareddy district have raised concerns against the PRC report
'టీచర్ల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?'
author img

By

Published : Feb 9, 2021, 4:23 PM IST

సంగారెడ్డి జిల్లాలో పీఆర్​సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పీఆర్​టీయూటీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఉపాధ్యాయుల జీతాలు, బదిలీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తూ.. ఫిట్మెంట్​ను 45శాతం పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు. టీచర్ల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.