క్రీడల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో బాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించారు. వాటి బహుమతుల ప్రదోనోత్సవానికి సునీతా రెడ్డి హజరయ్యారు.
రోజు ఏదో ఒక క్రీడ ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉండి వ్యాధులు దరిచేరవన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయట పడుతుందని చెప్పారు. సునీతా రెడ్డి కాసేపు బాడ్మింటన్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అనంతరం పోటీలలో గెలిచిన వారికి బహుమతులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: చోరీకి యత్నించిన కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్