కొవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని బోరిగి గ్రామానికి చెందిన సుధాకర్ తన వాహనంలో ప్రచారం చేపడుతున్నాడు. గతవారం రోజులుగా నిత్యం పలు గ్రామాలు తిరుగుతూ... స్థానికులను చైతన్య పరుస్తున్నాడు. ఎలాంటి ధనాపేక్ష లేకుండా సొంత ఖర్చులతో గ్రామాలన్ని చుట్టివస్తున్నాడు.
అతని టాటాఏస్ వాహనానికి బ్యానర్లు కట్టి అందులో సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ప్రచారం చేపడుతున్నాడు. అందుకు నిత్యం డీజిల్‌కు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఆయన స్వచ్ఛంద సేవను చూసి ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు