సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన రాయితీ సోయా విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మొక్కజొన్నకు బదులు సోయా సాగు చేయాలని అధికారులు చెబితే విని తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం రాయితీపై మండలంలోని వివిధ గ్రామాల్లో 7 వేల బస్తాల సోయా విత్తనాలు పంపిణీ చేసింది. దాదాపు సగానికి పైగా రైతుల వద్ద అవి మొలకెత్తలేదు. నాణ్యమైన విత్తనాలు కాకపోవటం వల్ల పొలంలోనే మొలకెత్తకుండా మురిగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్