సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని ఎస్సీ వసతిగృహంలో ఉండే విద్యార్థినిలతో వసతిగృహ నిర్వాహకులు వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదివే ఎస్సీ విద్యార్థినిలు ఉచితంగా ఉండేందుకు... పటాన్చెరు పరిధిలో ఎస్సీ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సౌకర్యాలలేమితో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలలు కడిగేందుకు ఎవరూ లేకపోవడం వల్ల... విద్యార్థినులే ఆ పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
చెత్తను సైతం ఎత్తిపోయాల్సి వస్తోందని వారు చెప్తున్నారు. దీనిపై హాస్టల్ వార్డెన్ అనితను ఈటీవీ భారత్ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా... మూత్రశాలలు కడిగేందుకు ఎవరూ రానందువల్లే విద్యార్థినిలు కడుగుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు సైతం ఎవరి మూత్రశాల వారే శుభ్రం చేసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆమె వాయిస్‌ను కెమెరాతో చిత్రీకరించే సమయంలో మాత్రం... నిన్న హోలీ పండుగ ఉందని అందువల్లే కడిగారని చెప్పారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు