ETV Bharat / state

పురపాలికల్లో రగడ.. ఛైర్మన్‌లపై అవిశ్వాసం నోటీసులు

Friction Started in Municipalities of Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పురపాలికల్లో ముసలం మొదలైంది. రెండింట్లో ఛైర్మన్‌పై అవిశ్వాసం నోటీసులు ఇవ్వగా మరికొన్ని మున్సిపాలిటిల్లోనూ ఇదే తరహా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే అదునుగా డిమాండ్లు నేరవేర్చుకునేందుకు కౌన్సిలర్లు పావులు కదుపుతుండగా, పదవి కాపాడుకునేందుకు చైర్మన్లు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లా కావడంతో అవిశ్వాసాల వ్యవహారం ఆసక్తిగా మారింది.

Friction Started in Municipalities
Friction Started in Municipalities
author img

By

Published : Feb 7, 2023, 9:06 AM IST

Updated : Feb 7, 2023, 10:08 AM IST

Friction Started in Municipalities: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక్కో పురపాలికల్లో అవిశ్వాసం సెగలు రేగుతున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి, అందోల్-జోగిపేట మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు అందించారు. మూడేళ్లక్రితం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సంగారెడ్డిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మహిళకి రిజర్వ్‌ కావడంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి ఎంపికయ్యారు.

నిధుల కేటాయింపులో వార్డులపై వివక్ష చూపుతున్నారన్న కారణంతో కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అందోల్-జోగిపేట పురపాలికకు చెందిన కౌన్సిలర్లు సైతం ఛైర్మన్ మల్లయ్య యాదవ్‌పై అవిశ్వాసం నోటీసును కలెక్టరుకు అందించారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని, కేవలం ఛైర్మన్ ఒంటెద్దు పోకడల వల్లే అవిశ్వాసం పెడుతున్నామని కౌన్సిలర్లు తెలిపారు. పలు పురపాలికల్లోనూ కౌన్సిలర్లు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

కౌన్సిలర్లు, కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు

అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధం: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయమ్మపై అవిశ్వాసానికి యత్నిస్తున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా చేర్యాల ఛైర్మన్‌పైనా అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఛైర్మన్ మురళీ యాదవ్ ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొందరు కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తూప్రాన్ ఛైర్మన్ రవీందర్‌పై పలువురు కౌన్సిలర్లు కొంతకాలంగా బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా పలు పురపాలికల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. పదవి ఆశిస్తున్నవారు అసమ్మతి కౌన్సిలర్లను ప్రోత్సహిస్తూ హమీలు సైతం ఇస్తున్నారు. కౌన్సిలర్లు అవిశ్వాసానికి పావులు కదుపుతుంటే ఛైర్మన్లు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడం, కీలక మంత్రి హరీశ్‌రావు ఉండటంతో ఆవిశ్వాసం నోటీసుల వరకే పరిమితం అవుతుందన్న ధీమాలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 7, 2023, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.