ETV Bharat / state

స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పై ఎక్కువ కాలం తుంపర్లు!

author img

By

Published : Feb 23, 2021, 7:29 AM IST

సాధారణ అద్దాలతో పోల్చితే స్మార్ట్‌ఫోన్‌ తెరల మీద కొవిడ్‌ వైరస్‌ ఎక్కువ కాలం జీవించడానికి అవకాశముందని ఐఐటీ (హైదరాబాద్‌) పరిశోధకులు గుర్తించారు. స్క్రీన్‌, స్క్రీన్‌గార్డులలో నీటిని పీల్చుకునే గుణం ఉండకపోవడమే దీనికి కారణమని వారు పేర్కొన్నారు.

smart phone
స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పై ఎక్కువ కాలం తుంపర్లు!

కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతున్న వేళ వీరి పరిశోధనాంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎంతసేపు ఎండిపోకుండా ఉంటాయనే అంశమై వీరు పరిశోధించారు. తుంపర్లు ఎండిపోతే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయని గుర్తించారు.

‘‘నీటి బిందువులతో పోల్చితే వ్యక్తి నుంచి వెలువడే తుంపర్లలో ఉప్పు, ప్రోటీన్‌ (మ్యూకస్‌), కొంత మేర నీరు కలిసి ఉంటాయి. దీనివల్ల కూడా తుంపర్లు ఆవిరవడానికి, ఎండిపోయేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక నానోలీటర్‌ తుంపర జీవితకాలం ఒక్క నిమిషం మాత్రమే. అదే 10 నానోలీటర్ల తుంపర ఆవిరవ్వడానికి 15 నిమిషాలు పడుతుంది. కానీ గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ తేమ ఉంటే ఆ సమయం గంటకు పైగా ఉంటుంది’’ అని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఆచార్య కీర్తీచంద్ర సాహు వివరించారు. ఎండిపోయిన తుంపర్లలోనూ కొన్నిసార్లు వైరస్‌ బతికే ఉంటోందని, దానికి కారణాలను తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరగాలన్నారు. ఆయనతో పాటు డాక్టర్‌ శరవణన్‌ బాలుస్వామి, డాక్టర్‌ సాయక్‌ బెనర్జీ ఇందులో భాగస్వాములయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.