సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పార్కును ఏర్పాటు చేశారు. మహిళాదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పార్కు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ హనుమంతురావు వెల్లడించారు. ఈ పార్కు నిర్మాణంలో మహిళలు కృషి ఎనలేనిదని తెలిపారు.
మహిళల గొప్పదనానికి ఎవరూ సాటిలేరని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ప్రతి వార్డులో పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మహిళల కోసం టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇవీ చూడండి: వెనుకబడిన వర్గాలకు రూ.4,356.82 కోట్లు