సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా సందర్శించారు. స్టేషన్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్ పార్కులో మొక్కలు నాటారు. మురుగు నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్‌ను రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. పట్టణం మీదుగా అదనపు రైళ్లను నడపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశారు. బీదర్-ముంబై, బీదర్ -గుల్బర్గా, వికారాబాద్- అజ్మీర్ రైళ్లను జహీరాబాద్ వరకు నడపాలని కోరారు. 65 నంబర్ జాతీయ రహదారిపై గతంలో ప్రతిపాదించిన లింగంపల్లి-సంగారెడ్డి-సదాశివపేట-జహీరాబాద్ రైలు మార్గాన్ని నిర్మించేలా చూడాలని కోరారు.
ఇదీ చూడండి: సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్ విద్యార్థులు