విద్యార్థుల రాకతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాఠశాలలు సందడిగా మారాయి. పది నెలల తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత తమ స్నేహితులను కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని అధికారులు చెప్పినా... జిల్లాలోని కొన్ని పాఠశాలల యాజమాన్యం పెడచెవినపెట్టారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహించి.. విద్యార్థుల ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరించారు. కొన్ని పాఠశాల నిబంధనలు పాటించకపోవడం వల్ల తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు.
- ఇదీ చూడండి : భాగ్యనగరంలో బడిబాట.. విద్యార్థుల్లో ఉల్లాసం