ETV Bharat / state

SHE TEAMS: ఆకతాయిలపై షీ టీం కొరడా - తెలంగాణ వార్తలు

మహిళలు, యువతులను వేధిస్తున్న ఆకతాయిలపై సైబరాబాద్‌ షీ బృందాల పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. పోకిరీలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. వేధిస్తూ పట్టుబడితే కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వినకపోతే కటకటాల వెనక్కి పంపుతున్నారు.

she team, cyberabad commissionerate
షీ బృందాలు, సైబరాబాద్ కమిషనరేట్
author img

By

Published : Jun 28, 2021, 1:57 PM IST

మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలపై సైబరాబాద్‌ షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నారు. వేధిస్తూ పట్టుబడిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు.

11 బృందాలు

మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 11 షీ టీం బృందాలు సైబరాబాద్‌ పరిధిలో పనిచేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు వేధింపులకు సంబంధించి 97 ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. మహిళలను మోసం చేసి, వివాహం చేసుకోం అనే వేధింపులకు సంబంధించినవి- 13, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు సంబంధించినవి- 4 కేసులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఒక ఫిర్యాదు అందాయని పోలీసులు వెల్లడించారు.

హెచ్చరికలు

వీటితో పాటు మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. మొత్తం 12 కేసులు నమోదు చేయగా... వీటిలో 7 క్రిమినల్‌ కేసులు, 5 సాధారణ కేసులు కాగా.. 65 ఫిర్యాదుల్లో పోకిరీలను తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినట్లు చెప్పారు. కమిషనరేట్‌ పరిధిలో మూడు బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు వెల్లడించారు.

డెకాయి ఆపరేషన్​లు

పోకిరీలను ఆధారాలతో పట్టుకునేందుకు పోలీసులు డెకాయి ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. వేధింపులకు గురైన వారు డయల్‌ 100, 949061744 నంబర్లు, sheteam.cyberabad@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

ఉపేక్షించేది లేదు

మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: Etv Bharat Effect: 'కొత్తింట్లో అడుగుపెట్టిన అక్కాతమ్ముడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.