ETV Bharat / state

అమీన్‌పూర్‌ వద్ద గల్లంతైన వ్యక్తికోసం రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌

author img

By

Published : Oct 16, 2020, 11:40 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ఇసుకబావి వద్ద కొట్టుకుపోయిన వ్యక్తి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతై మూడు రోజులైనా ఆచూకీ లేకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాగు దాటే క్రమంలో కారుతో సహా వ్యక్తి కొట్టుకుపోయాడు.

searching for a person missing at aminpur in sangareddy
అమీన్‌పూర్‌ వద్ద గల్లంతైన వ్యక్తికోసం రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ఇసుకబావి వద్ద కొట్టుకుపోయిన ఆనంద్ అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా... ఆచూకీ లభించకపోవడంతో ఈరోజు ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

అమీన్‌పూర్‌ మండలం ఇసుక బావి వద్ద ఉన్న మురుగు కాలువ పై వాగు దాటుతుండగా ఆనంద్ అనే వ్యక్తి కారుతో సహా కొట్టుకుపోయాడు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద వంతెనపై నుంచి పడటంతో ఘటన జరిగింది. మూడురోజులుగా మత్స్యకారులు, గజ ఈతగాళ్ల సాయంతో వెతికినా ఫలితం లేకపోయింది.

ఇదీ చదవండి: వరద నీటిలో చిక్కుకుని 100 గేదెలు మృత్యువాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.