సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో సాంకేతిక లోపాలతో కంప్యూటర్లు పని చేయకపోవడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండ్రోజుల నుంచి సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజూ బ్యాంకుకు వచ్చి సేవలు నిలిచిపోయాయన్న బోర్డు చూసి వెనక్కి తిరిగి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
ప్రస్తుతం పండగ సీజన్‌తో పాటు పంటలకు ఎరువులు, పురుగు మందులు వేయడానికి కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరం ఉంది. వినియోగదారులు, రైతులు, ఉద్యోగులు.. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడూ సిస్టం పనిచేయడం లేదని బోర్డు కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజులుగా సాంకేతిక లోపం ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే స్పందించి .. సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.