సంగారెడ్డిని ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలని సర్పంచులు ధర్నా నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశానికి హాజరవుతున్నారన్న సమాచారంతో సభావేదిక ఆవరణలో ఆందోళనకు దిగారు. ఉపసర్పంచుల చెక్‌పవర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల గ్రామాభివృద్ధి, పాలనలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఎనిమిది మంది పిల్లలు..కుటుంబ నియంత్రణ వద్దు..