సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అమరవీరుల స్థూపం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పటేల్ ఆశయాలతో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశం కోసం.. ధర్మం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, ఆయన లక్ష్య సాధనతోనే మనం ఇలా నిలబడ్డామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ భాజపాను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సంస్థకు కొత్త రూపు తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు