సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని మంజీరా బాలాజీ గార్డెన్ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన రథయాత్రను శ్రీ వైకుంఠపురం వరకు నిర్వహించారు.
ప్రతి ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు తెలిపారు. ఈ నెల 13న జరిగే స్వామి వారి కల్యాణంలో పాల్గొనాలని భక్తులను ఆహ్వానించారు. దేవుని కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: సీఎం అభ్యర్థిపై నిర్ణయం వారిదే: భాజపా