పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఇళ్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి రూ.పదివేలు మాత్రమే తీసుకోవాలని కోరారు. సీఎం నుంచి ఈ ప్రకటన త్వరగా వస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అపోలో నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్