వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నూతనంగా తీసుకువచ్చిన 2019 చట్టం ఎంతో విశిష్టమైనదని సంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ నిఖిలారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వస్తువుల నాణ్యతా లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి.. పరిహారం పొందాలని సూచించారు. 1986 వినియోగదారుల చట్టం కన్నా.. నూతనంగా తీసుకువచ్చిన 2019 చట్టం వినియోగదారులకు ఎంతో మేలుచేస్తుందని తెలిపారు. వినియోగదారుల హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఇవీచూడండి: ఈనెల 26న నల్గొండ జిల్లా కోర్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి