ETV Bharat / state

Transfer allegations : జైలు ఉద్యోగులపై ఆరోపణలు.. ఒకేసారి ఐదుగురు బదిలీ

సంగారెడ్డి జిల్లా జైలులో ఒకేసారి ఐదుగురు ఉద్యోగులను బదిలీ(Transfer allegations) చేశారు. ఖైదీల నుంచి ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Transfer allegations, allegations on jail employees
సంగారెడ్డి జిల్లా జైలు ఉద్యోగులపై ఆరోపణలు, ఉద్యోగుల బదిలీలు
author img

By

Published : Nov 20, 2021, 12:56 PM IST

సంగారెడ్డి జిల్లా జైలు(Sangareddy district jail news)లో ఒకే సారి ఐదుగురు ఉద్యోగులను బదిలీ చేయటం చర్చనీయాంశమైంది. విచారణ ఖైదీల నుంచి ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారంటూ ఆరోపణలు(Transfer allegations) వచ్చిన నేపథ్యంలో.... వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బెంగళూరుకి చెందిన ఓ విచారణ ఖైదీ ఇద్దరు అధికారులకు కొత్త వాహనాలు కొనిచ్చారని ప్రచారం జరిగింది. అతడితో పాటు మరికొందరికి అనుకూలంగా వ్యవహరించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా విచారించిన డీఐజీ మురళి బాబు అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చారు.

అవన్నీ పుకార్లే..

జైలు(Sangareddy district jail news)లో అవినీతి జరుగుతోందని ప్రచారం సాగడం... డీఐజీ మురళి బాబు ఈ నెల 16న సంగారెడ్డి జైలుకు రావడంతో.. ఇక్కడ ఏదో జరుగుతోందనే చర్చ మొదలయింది. కానీ అలాంటిదేమీ లేదని ఆయనే స్పష్టతనిచ్చారు. కేవలం ఇద్దరు అధికారుల మధ్య అవగాహన లోపం వల్లే సమస్య వచ్చిందన్నారు. అవినీతి ఆరోపణలు కేవలం పుకార్లేనని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే జైళ్ల శాఖ ఇంఛార్జి డీజీ జితేందర్ ఇక్కడ పని చేస్తున్న ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్లను ఇతర చోట్లకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వాట్సాప్ సందేశం చర్చనీయాంశం..

ఈ జైలు(Sangareddy district jail news)కు గత కొన్ని నెలలుగా సైబరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి విచారణ ఖైదీలను తీసుకొస్తున్నారు. ఇందులో కొందరు బాగా డబ్బున్న వాళ్లు, భారీ మోసాలకు పాల్పడిన వాళ్లు ఉండటంతో... వారి నుంచి జైలు సిబ్బంది ప్రయోజనం పొందుతున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. బదిలీ ఆదేశాలు(Transfer allegations) వచ్చిన తర్వాత.. ఒక అధికారి వాట్సాప్​లో పెట్టిన సందేశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దోషులు తప్పక దొరుకుతారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణల మీద ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి.. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అంటున్నారు.

ఇదీ చదవండి: ORR Accident Hyderabad Today :ఓఆర్​ఆర్​ వద్ద అమెరికా తరహా ప్రమాదం.. ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.