ETV Bharat / state

Samhita Microsoft Job 52 lakh package : చదువుల తల్లి టాలెంట్​కు మైక్రోసాఫ్ట్ ఫిదా.. రూ.52 లక్షల ప్యాకేజీతో కొలువు - సంహిత స్టోరి

Samhita Microsoft Job 52 lakh package : మధ్యతరగతి జీవితం గడిపే యువతకు వారి కుటుంబాల పట్ల ఉండే బాధ్యత చాలా గొప్పది. ఆ యువతి కూడా ఈ కోవకు చెందిందే. బీటెక్‌ చదువుకునే రోజుల్లో యువత ఎక్కువగా ట్రెండీగా ఉండాలని.. వింత పోకడలకు పోతుంటారు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న ఈ యువతి మాత్రం మొదటి ఏడాది నుంచే గురువుల సూచనలతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. ఫలితంగా మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించింది. అరకొర ప్యాకేజీ కాదండోయ్‌. అక్షరాల రూ.52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. మరి, ఆ యువతి ప్రయాణం ఎలా సాగిందో.. తెలుసుకుందాం!

Samhitha Got Job in Microsoft with High Package
BVRIT College Student Got Microsoft Job
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 1:12 PM IST

BVRIT College Student Samhitha Article అరకోటి ప్యాకేజ్‌తో జాబ్‌ సాధించిన సంహిత

Samhita Microsoft Job 52 lakh package : కష్టపడాలనే ఆలోచన ఉండాలే గానీ.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేందుకు ఓ అమ్మాయి నిదర్శనంగా నిలుస్తోంది. లక్షల ప్యాకేజీలు ఈరోజుల్లో సాధారణమైపోయాయి. కానీ దానిని సాధించేందుకు ఆ యువతి మొదటి సంవత్సరం నుంచే ఆ దిశగా అడుగులేస్తు ముందుకు సాగింది. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం వెళ్లి.. అదే సంస్థలో అరకోటి ప్యాకేజీ ఉద్యోగాన్ని అవలీలగా పట్టేసింది.

Samhitha Success Story in Sangareddy : సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన సంహిత అనే యువతి చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందు ఉండేది. పుష్పలత, విష్ణువర్ధన్‌ రెడ్డిలు ఆమె తల్లిదండ్రులు. సంహిత ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తరువాత ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కాలేజీ(BVRIT College)లో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. నిత్యం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే సంకల్పమే తనను ఈ స్థాయికి చేర్చిందని చెబుతోంది. తనకు గురువులు చేసిన సాయం మర్చిపోలేనని తెలిపింది.

BTech Student Microsoft Job 52 Lakh Package : గురువుల సూచనలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే రూ.52 లక్షల ప్యాకేజీ అందుకునే స్థాయికి చేరానని సంహిత చెప్పింది. అయితే తనలో నేర్చుకోవాలనే తపన ఉన్న విషయాన్ని కళాశాల గుర్తించిందని చెబుతోంది. దాంతో పాటు తన భవిష్యత్‌ ప్రణాళికల వివరాలను తెలిపింది. గతంలో మైక్రోసాఫ్ట్‌(MicroSoft Job)లో ఇంటర్న్‌షిప్‌ కోసం వెళ్లినప్పుడు నెలకు లక్ష 25 వేల రూపాయల స్టైఫండ్‌తో మూడు నెలలు పూర్తిచేసింది. తర్వాత అందులోనే ఉద్యోగాన్ని సాధించింది. నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఏదైనా సాధ్యమేనని.. తన జూనియర్లకు కూడా సలహాలిస్తోంది.

SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది'

"నేను ప్రస్తుతం బీవీఆర్‌ఐటీ కాలేజీలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. నేను మూడో సంవత్సరం చదివినప్పుడే మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం వచ్చింది. అప్పుడు ఓ ప్రాజెక్ట్‌ నాకు ఇచ్చారు. దాన్ని నేను అనుకున్న సమయానికి పూర్తి చేశాను. నా వర్క్‌ నచ్చి ఫుల్‌టైం ప్లేస్‌మెంట్‌ ఇచ్చారు. రూ.52 లక్షలు ప్యాకేజీ అందించారు. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయికి చేరుకోడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎంతో సాయం చేశారు." - సంహిత, విద్యార్థిని

Engineering Student Samhitha Story : ఇంజినీరింగ్ సమయంలో ఖాళీగా ఉండకూడదని.. నిత్యం పుస్తకాలు చదవాలని అప్పుడే జ్ఞాన సముపార్జన చేయగలమని సూచనలు ఇచ్చింది. ఎక్కువ సమయాన్ని లైబ్రరీలోనే గడిపిందని తెలిపింది. ఈమెలో ఉన్న ఆసక్తిని గమనించి.. కళాశాల కూడా అండగా నిలిచింది. తమ విద్యార్థిని ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉందని అధ్యాపకులు చెబుతున్నారు. మట్టిలో మాణిక్యాలు అంటే ఇలాంటి వారే. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే యువత లక్ష్యంగా చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరేందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అసాధ్యమైనదేదీ లేదు.

Young cloud Photographer in Hyderabad : ఫొటోలతో మేఘ సందేశం.. చూస్తే వావ్​ అనాల్సిందే..!

Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'

Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.