ETV Bharat / state

బాధితులు అలా.. అధికారులు ఇలా..

సంగారెడ్డి జిల్లా జుల్​కల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను అధికారులు కూల్చివేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్చి వేయడం న్యాయమా అని బాధితులు ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టవద్దని ముందే గ్రామస్థులకు చెప్పామని మండల రెవెన్యూ అధికారి రమాదేవి తెలిపారు.

author img

By

Published : Sep 22, 2020, 11:08 PM IST

బాధితులు అలా.. అధికారులు ఇలా
బాధితులు అలా.. అధికారులు ఇలా

సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్​కల్ గ్రామంలో 195 సర్వే నెంబరు గల 26 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సుమారు 70 కుటుంబాలు ఈ భూముల్లో తమ పూర్వీకుల నుంచి ఉంటున్నట్లు బాధితులు చెబుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్చి వేయడం న్యాయమా అని బాధితులు ప్రశ్నించారు.

భూమి లాక్కునే అధికారులు.. ఇవే స్థలాలపై పన్నులు ఎందుకు వసూలు చేశారని నిలదీశారు. బాధితులు తాము కాయకష్టం చేసి గూడు నిర్మించుకుందామనే ఉద్దేశంతో ఇళ్లు కట్టుకుంటే కనికరం లేకుండా కూల్చి వేయడం సరికాదన్నారు. ప్రభుత్వ అధికారుల కాళ్లా వేళ్లా పడ్డా దయ చూపలేదని వాపోయారు.

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టవద్దని ముందే జుల్​కల్ గ్రామస్థులకు చెప్పామని మండల రెవెన్యూ అధికారి రమాదేవి తెలిపారు. నిర్మాణాలను వారినే తీసివేయమని కోరిన వారు స్పందించకపోతే.. చట్టపరంగా తాము ఈ చర్య తీసుకున్నామని వివరించారు. ఆ సర్వే నెంబరులో కొందరు క్రమబద్ధీకరణ చేసుకున్నారని.. వారికి ఎలాంటి నష్టం కలిగించలేదన్నారు. మరికొందరు బాధితులు ఇంకా కొంత సమయం కోరడం వల్ల గడువు ఇచ్చామన్నారు. చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని అధికారి వివరించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వభూమిలో అక్రమకట్టడాలు.. కూల్చేసిన అధికారులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.