సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 15 రోజులుగా ఒక్క కోరనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. పట్టణంలో రెడ్జోన్లుగా ప్రకటించిన గడీమొహల్లా, బృందావన్కాలనీలను అధికారులు సేఫ్జోన్లుగా ప్రకటించారు. రాకపోకలపై విధించిన ఆంక్షలను నేడు సడలించారు.
రెడ్‌జోన్ ఎత్తివేసినా... లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుందని ఆర్డీవో రమేశ్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.