రేషన్ కోసం ఆధార్ కార్డుకు చరవాణి నంబర్ అనుసంధానం చేయించుకునేందుకు లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మీసేవ, పోస్టు ఆఫీస్ కార్యాలయాల ఎదుట బారులు తీరారు. చాలా మంది నిరక్షరాస్యులు కావడంతో రేషన్ కార్డు వివరాలు ఫారాల్లో నమోదు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![Ration beneficiaries post office and Aadhaar registration centers in Zaheerabad, Sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570145_979_10570145_1612954720924.png)
దాని కోసం పలువురు రూ.30 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఆధార్ సంఖ్యకు చరవాణి నంబర్ అనుసంధానానికి రూ.100 నుంచి రూ.150 తీసుకోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. పాత పద్ధతిలోనే రేషన్ సరుకులు అందించి ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: బైక్ను తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు జలసమాధి