ETV Bharat / state

Rajiv Park Problems In Sangareddy : అధికారుల నిర్లక్ష్యంతో.. అడవిలా మారిపోయిన సంగారెడ్డి రాజీవ్ పార్కు

Rajiv Park Problems In Sangareddy : ప్రస్తుతం ఉన్న పని ఒత్తిళ్లతో కాసేపు విశ్రాంతి దొరికితే ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. అలా చల్లగాలి వీస్తూ పచ్చని చెట్లు ఉంటే ఇంకా ఆ అనుభూతే వేరు. మన పరిసర ప్రాతంలోనే కుటుంబ సమేతంగా సరదాగా గడపడానికి, ఉదయం, సాయంత్రం నడవడానికి పార్కులు ఉంటే తప్పని సరిగా వినియోగించుకుంటాం. అదే క్రమంలో సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్‌ పార్కును ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ప్రజాదరణ పొందిన ఈ పార్కు.. ప్రస్తుతం అడవిని తలపిస్తోంది. సంగారెడ్డి రాజీవ్ పార్కు దీనస్థితిపై ప్రత్యేక కథనం.

People Facing Problems Parks In Sangareddy
Rajiv Park Problems In Sangareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 1:39 PM IST

Updated : Oct 5, 2023, 2:30 PM IST

Rajiv Park Problems In Sangareddy : అధికారుల నిర్లక్ష్యంతో.. అడవిలా మారిపోయిన సంగారెడ్డి రాజీవ్ పార్కు

Rajiv Park Problems In Sangareddy : సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రజల సౌకర్యాల కోసం 2013లో రూ.3కోట్ల రూపాయలతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ పార్కును ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా మంచి హంగులతో పార్కు అందుబాటులోకి తీసుకొచ్చారు. సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా వచ్చి రోజు మొత్తం అక్కడే గడిపి సేద తీరేవారు. చిన్నారులు ఆడుకోవడాని ప్రత్యేకించి వ్యాయామ పరికరాలను కూడా పార్కులో ఏర్పాటు చేశారు.

పార్కులోనికి ప్రవేశానికి రూ.10 సంవత్సరాల చిన్నారులకు రూ.5 రూపాయలు, ఆ పై వయసు కలిగిన వారికి రూ.10 రూపాయల చొప్పున టికెట్‌ నిర్ణయించారు. ప్రతి రోజు వాకింగ్‌ కోసం వచ్చే వారికి నెల రోజులకుగాను రూ. 250 రూపాయలుగా ధర నిర్ణయించారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు పార్కును పూర్తిగా మూసివేశారు. తిరిగి గత 6నెలల క్రితం పునఃప్రారంభించారు. దాని మరమ్మతుల కోసం ప్రత్యేక నిధుల కింద 50 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆధునికీకరణ కోసం ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు.

Siddipet Dinosaur Park Opening : ఔరా అనిపిస్తున్న 'సిద్దిపేట డైనోసార్ థీమ్ పార్క్' చూశారా..?

ఇంతక ముందు 2019లో రూ.95 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసినా ప్రయోజనం శూన్యం. నిధులు కేటాయిస్తున్న అభివృద్ధి మాత్రం నామ మాత్రంగానే నిలుస్తోంది. ప్రస్తుతం చిన్నారులు ఆడుకోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన అడవిలా ముళ్లపొదలు పేరుకుపోయాయి. ఎటు చూసినా అపరిశుభ్రత, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

సరైన పర్యవేక్షణ లేక మందుబాబులకు పార్కు అడ్డాగా నిలిస్తోంది. కాలక్షేపం చేయాలనుకునేవాళ్లంతా ఇక్కడే సంచరిస్తున్నారు. జిల్లా నడిబొడ్డున ఉన్న పార్కు ఇంత దారుణంగా మారుతున్నా.. అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. తమకు ఎంతగానో ఉపయోగపడిన పార్కు ఇప్పుడు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే పాడైపోతోందని ఆరోపిస్తున్నారు. తమ పార్కును తిరిగి వాడకంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

Lake Front Park in Hyderabad : లేక్‌ఫ్రంట్‌ పార్క్‌కు సందర్శకుల తాకిడి.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వాక్‌ వే

పార్కులో జనాన్ని ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన వాటర్‌ఫాల్‌ వినియోగం లేక ఆ ఇనుప గొట్టాలు తుప్పు పట్టాయి. పూర్తిగా ప్రజాధనం వృథా అవుతోంది. వర్షం పడితే ఆట స్థలాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి.సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బల్లలను పిచ్చి మొక్కలు కమ్మేశాయి. పూర్తిగా పార్కు మొత్తం గడ్డి పేరుకు పోయి విషసర్పాలకు ఆవాసంగా నిలుస్తోంది. పార్కు అందాల కోసం ఏర్పాటు చేసిన మొక్కలు కూడా అందహీనంగా మారిపోయాయి.

కోట్ల రూపాయలు ప్రజా ధనం వెచ్చించి పార్కును ఏర్పాటు చేస్తే.. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే అడవిగా మారిపోయిందంటే ఇక్కడ అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి పార్కును సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు భావిస్తున్నారు.

Top Tourist Places in Hyderabad : హైదరాబాద్​లో కొత్త పర్యాటక ప్రాంతాలు.. వీటిని మీరు చూసారా!

GHMC Commissioner Ronald Rose on Indira park Flyover : ఇందిరాపార్క్​ నుంచి వీఎస్​టీ వరకు త్వరలో అందుబాటులోకి రానున్న స్టీల్ బ్రిడ్జి

Last Updated : Oct 5, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.