సంగారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ వర్ధంతిని నిరాడంబరంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూనే అందిరికీ భోజనం అందజేశారు.
రాజీవ్ గాంధీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని తెలిపారు. ఆయన చేసిన కృషి వల్లే మన అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. దేశ రక్షణ కోసం వారి కుటుంబం చేసిన సేవ ఎనలేనిదని నిర్మలారెడ్డి ప్రశంసించారు. ప్రజలందరూ కరోనా నియమ నిబంధనలను పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం