కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం, అధికారులు చెప్పిన సూచనలను పాంటించండి అంటూ శ్రీనిధి అనే చిన్నారి నృత్యం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనిధి నాలుగో తరగతి చదువుతోంది. కరోనా మహమ్మారి మన వద్దకు చేరకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కూచిపూడి నాట్యం చేస్తూ వివరిస్తోంది.
కరోనాపై నూతనంగా వచ్చిన "చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా" అనే పాటను కూచిపూడిలో ప్రదర్శిస్తూ ప్రజలను మేల్కొల్పేలా చిన్నారి చేస్తున్న నృత్యం పలువురిని అలరిస్తుంది.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి