సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామేశ్వరం మండలాల్లో పోలీసులు తెల్లవారుజాము నుంచి కట్టడి ముట్టడి నిర్వహించారు. డిఎస్పీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బందితో ఈ తనిఖీలు జరిపారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నేరుగా తనిఖీలు నిర్వహించి విచారించారు. సరైన పత్రాలులేని 40 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇద్దరు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల శాంతి భద్రతల కోసమే కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య