సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి ఐబి వరకు నిర్వహించిన ర్యాలీలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒంటి కాలిపై నిలబడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో చేరతామని కార్మిక సంఘం ప్రకటించినా... ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని ప్రభుత్వానికి విన్నవించారు.
ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం