ETV Bharat / state

విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ ఆత్మహత్య చేసుకుంది! కాలేజీలోనే తనువు చాలించింది. అసలేం జరుగుతుందో.. ఎవరూ చెప్పడం లేదు. విద్యార్థి నేతలు మృతదేహాన్ని మార్చురీ నుంచి బయటికి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. తన గారాల పట్టిని అలా చూసి ఆగలేని ఆ తండ్రి... శవంపై పడి విలపిస్తున్నాడు. ఇంతలో ఓ పోలీసాయన అక్కడకు వచ్చాడు. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిపై తన ప్రతాపాన్ని చూపించాడు. బూటుకాలితో డొక్కలో తన్నుతూ..

author img

By

Published : Feb 26, 2020, 5:36 PM IST

Updated : Feb 26, 2020, 7:55 PM IST

police-rash-behaviour-with-student-leaders-against-protest-in-sangareddy
విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!
పోలీసుల దురుసు ప్రవర్తన

విద్యార్థులు గుమిగూడారు. నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యపై చర్చిస్తున్నారు. వీరికి బంధువులు తోడయ్యారు. హైదరాబాద్​లోని పటాన్​చెరు ప్రభుత్వ ఆస్పత్రి లోపల ఏం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. అందరితోనూ కలివిడిగా, ఆనందంగా ఉండే ఆ విద్యార్థిని ఎందుకు చనిపోయిందో అంతుపట్టడం లేదు. అందరూ కలిసి మార్చురీ లోపలికి చొచ్చుకెళ్లారు. విద్యార్థిని మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలో విద్యార్థి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టే పనిలో పడ్డారు. అంతలోనే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు శవం మీద పడి రోదిస్తున్నారు. పోలీసులు వారిపైనా దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థిని తండ్రిని ఓ పోలీసు బూటుకాలితో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు.

అక్కడున్న వారందరూ ఆ తండ్రిపై జాలిని చూపిస్తుంటే.. పోలీసులు మాత్రం ప్రతాపం చూపారు. ఖాకీల తీరును విద్యార్థులు, అక్కడున్న వారు తప్పు పట్టారు. అసలే బిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే.. పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. 'ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్' అంటూ అక్కడున్న వారు గుసగుసలాడారు. చివరికి పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విద్యార్థి నేతలను పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి: మాటమాట పెరిగింది.. కత్తితో దాడి చేసే వరకు తీసుకెళ్లింది

Last Updated : Feb 26, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.