పటాన్ చెరు అంటే మినీ ఇండియా: మహిపాల్ రెడ్డి కాలుష్య పీడిత గ్రామాలకు తాగునీరు సరఫరా చేసిన దానికి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా చెల్లించమని అడిగితే అది కోర్టు ధిక్కారం అవుతుందని అధికారులను హెచ్చరించామని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు కాలుష్య గ్రామాలు ఉచితంగా తాగునీరు సరఫరా చేయాలని నిబంధన ఉందని మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉచితంగా నీరు అందించే కాలుష్య కారక పరిశ్రమల నుంచి బిల్లులు తీసుకోవాలని ఆయన చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ది అని తెలిపారు. పటాన్ చెరు అంటే అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉండే 'మినీ ఇండియా' అని అభిప్రాయపడ్డారు. అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజా సమస్యలు తీర్చి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఇవీ చూడండి: నష్టాల్లో నడుస్తున్న డిపోలను గట్టెక్కించేందుకు..'డిపోల దత్తత'