కరోనా కేసుల కట్టడి కోసం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పర్షపల్లి గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నారు. మూడు రోజుల్లో 16 మందికి కరోనా వైరస్ సోకడం వల్ల పది రోజుల పాటు సెల్ఫ్ లాక్డౌన్ విధించేందుకు పంచాయతీ తీర్మానం చేశారు. 11వ తేదీ నుంచి 21 వరకు పర్షపల్లి గ్రామం నుంచి రాకపోకలు నిషేధించారు.
మహమ్మారి కట్టడి కోసం గ్రామంలోని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. మల్చల్మ, కోహిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసుల కట్టడిలో పర్షపల్లి గ్రామస్థుల స్ఫూర్తిని పొరుగు గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి : హెల్మెట్ లేదని బండాపితే... ఆగమాగం చేశాడు