IIT Hyderabad: స్వప్నాలు సాకారం చేసుకునేందుకు యువత ముందుకు రావాలని పద్మభూషణ్ అవార్డు గ్రహీత క్రిష్ గోపాలకృష్ణన్ సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటీ హైదరాబాద్‌కు అభినందనలు తెలిపారు. 14 ఏళ్లలో ఐఐటీహెచ్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఐఐటీహెచ్‌లో పరిశోధన, ల్యాబ్ వసతులు పెరిగాయని అన్నారు. పరిశోధనలపై యువత దృష్టి సారిస్తేనే దేశం మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు.
పరిశోధనలపై మరింత దృష్టి సారిస్తేనే దేశ పురోగతి సాధ్యమని సెయెంట్ కంపెనీ సీఈవో బీవీఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆధునిక సాంకేతికత వల్ల మానవ జీవిత సమయం 30 ఏళ్లు పెరిగిందని చెప్పారు. పరిశ్రమలు, పరిశోధనపై నేటి యువత దృష్టి సారించాలని అన్నారు. నాలుగు విభాగాల్లో ఐఎస్‌వో ధ్రువపత్రాలు ఐఐటీ హైదరాబాద్ సొంతం చేసుకుంది. దేశంలోనే 4 విభాగాల్లో ఐఎస్‌వో సర్టిఫికెట్లు పొంది రికార్డు సాధించింది.
ఇదీ చూడండి: విశ్వనగరంలో విషజలాలు.. పట్టించుకోని అధికారులు.. ఆస్పత్రులపాలవుతోన్న జనాలు..