కరోనాతో చికిత్స పొందుతూ సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచేర్యాగడి ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్ అరవింద్ రెడ్డి మృతి చెందారు. కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన అరవింద్‌రెడ్డి గతంలో రెండుసార్లు జడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు. వారం రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.
అరవింద్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ సంతాపం ప్రకటించారు.