ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొనడం వల్ల ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందిన ఘటన ఇస్నాపూర్ జాతీయ రహదారిపై జరిగింది. సంగారెడ్డి ఇస్నాపూర్ నుంచి శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి వైపు వెళ్తున్నాడు. రహదారిపై అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన ఓ లారీ అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
అతని శరీరంపై నుంచి లారీ వెనుక చక్రం పోవడం వల్ల అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో దుర్మరణం పాలైన భర్తను చూసి భార్య గుండెలవిసేలా రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.